Saturday, June 19, 2010

Jayasudha - Biography in Telugu

సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. 2009 లో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏ గా గెలిచారు.

సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. ఈమె మద్రాసులో పుట్టి పెరిగినది కానీ మాతృభాష తెలుగు. ఈమె జన్మదినం డిసెంబర్ 17, 1959. ఈమె మేనత్త విజయనిర్మల. 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన 'పండంటి కాపురం' జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.

జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కు దాయాది అయిన నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.

2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనది. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును ప్రారంభించింది. 2009 లో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏ గా గెలిచారు.

No comments:

Post a Comment